నెల్లూరు జిల్లా వెంకటగిరి…నివర్ తుఫాను కారణంగా దెబ్బతిన్న వెంకటగిరి చేనేత కుటుంబాలను పరామర్శించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్…
కొంతమంది నేతన్నలకే వై యస్ ఆర్ నేతన్న హస్తం…సంపూర్ణంగా ప్రతిఒక్క నేతన్న కి అందని నేతన్న హస్తం…
ప్రతి ఏటా నేతన్నలకి 24 వేల రూపాయలు ఇచ్చి ఆదుకుంటామని చెప్పి, కొంతమంది చేనేత కుటుంబాలకు నేతన్న హస్తం కింద 24 వేల రూపాయలు ఇస్తున్నారని పవన్ వై యస్ ఆర్ పార్టీపై విమర్శలు గుప్పించిన జనసేనాని…
విపత్కర పరిస్తితులు సంభవించినప్పుడు మాత్రమే నేతన్నలను గుర్తించడం కాదు, దీర్ఘకాలిక ప్రయోజనాలు పొందేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి సూచించారు…
అంతర్జాతీయ స్థాయిలో పేరు ప్రఖ్యాతలు పొందిన వెంకటగిరి నేతన్న శ్రమని పాలకులు దోపిడీ చేస్తున్నారని పవన్ విమర్శించారు…చేనేత కుటుంబాలు ఆర్థికంగా, ఆరోగ్యంగా, స్ధిరపడే వరకు జనసేన అండగా నిలబడుతుందని పవన్ పేర్కొన్నారు…
పవన్ ప్రసంగించే సమయంలో అభిమానులు సి యం , సి యం అంటూ యువత కేరింతలకు స్పందించిన పవన్…
ముఖ్యమంత్రి అవుతానో లేదో తెలియదు కానీ, మీ ఆశీర్వాద బలం ఉంటే కూడా ప్రజల సమస్యలు తీర్చగలనని ఆయన అన్నారు…
అధికార పార్టీ తప్పు ఒప్పులను ప్రశ్నించానని నాపై దాడులు చేయాలనుకోవడం అవివేకం అని పవన్ అన్నారు. మీరు ఇలాంటి పిరికిపంద చర్యలకు పాల్పడితే మా జనసేన కార్యకర్తలు ఊరుకోరని వై సి పి నాయకులను హెచ్చరించారు…
సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తామని చెప్పి, ఆడపడుచులు దగ్గర కల్లబొల్లి మాటలు చెప్పి ఓట్లు వేయించుకుని, తీరా అధికారం లోకి వచ్చాక వై సి పి ప్రభుత్వమే షాపులు పెట్టి మద్యాన్ని విక్రయిస్తుందని వై సి పి ప్రభుత్వాన్ని ఎండగట్టారు…