వైసీపీ కార్యకర్తల దాడిని ఖండించిన మాజీ మంత్రి సోమిరెడ్డి

చిత్తూరు జిల్లా తంబళ్లపల్లి నియోజకవర్గంలో చనిపోయిన కార్యకర్తల కుటుంబాల పరామర్శకు వెళుతున్న పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు, రాజంపేట పార్లమెంటరీ నియోజకవర్గ అధ్యక్షుడు శ్రీనివాసులు రెడ్డి, జాతీయ ప్రధాన కార్యదర్శి నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు రమేష్, శంకర్, టీటీడీ బోర్డు మాజీ సభ్యుడు చల్లా రామచంద్రారెడ్డి, మధుబాబు తదితరులపై వైసీపీ కార్యకర్తల దాడిని ఖండించిన పొలిట్ బ్యూరో సభ్యులు, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి..

ప్రశాంతంగా పరామర్శించేందుకు కూడా హక్కులేని పరిస్థితులు వైసీపీ ప్రభుత్వంలో నెలకొన్నాయి..

రాళ్ల దాడికి గురై గాయాలపాలైన వారిని స్టేషన్ లో పెట్టిన పోలీసులు దాడులు చేసిన వారిని వదిలిపెట్టేస్తారా..

వైసీపీ నాయకులనే కాదు..కార్యకర్తలను చూసి కూడా పోలీసులు భయపడిపోతుండటం దురదృష్టకరం..

ఏపీలో శాంతిభద్రతలు కాపాడలేని పరిస్థితుల్లో పోలీసులుండటం బాధాకరం..