మైనర్ బాలికపై వృద్ధుడు అత్యాచారం

ఏడేళ్లబాలికపై గత ఐదు రోజులుగా పలుమార్లు అత్యాచారయత్నానికి ఒడిగట్టిన ఓ కర్కోటకుడుకి దేహశుద్ధి చేశారు టిడిపి నాయకులు స్థానిక మహిళలు ఈ ఘటన నెల్లూరు జాకీర్ హుస్సేన్ నగర్ లో చోటు చేసుకుంది. నిందితుడిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొని పోలీసులకు అప్పగించారు. బాధిత చిన్నారిని చికిత్స నిమిత్తం హాస్పిటల్కు తరలించారు. కేసు నమోదు చేసిన నెల్లూరు నవాబుపేట పోలీసులు కేసును దిశ పోలీస్ స్టేషన్ కు తరలించారు