మిల్లర్ లో ఇరుక్కొని మహిళ మృతి

నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం సంగం ఎర్రబల్లి గ్రామం నుండి యామల రమణమ్మ 45  తన భర్తతో కలిసి పనుల కోసం వింజమూరు వచ్చారు గురువారం ఉదయాన్నే పనులు చేస్తుండగా మిల్లర్ లో తన చీర కొంగు తగులు కొనగా ఆమె మిల్లర్ లోకి ఇరుక్కునీ పోయింది. వెంటనే పక్కనున్న కూలీలు ఆమెను బయటకు తీసేందుకు ప్రయత్నించారు కానీ ఆమె లోపల ఇరుక్కోవడంతో మిల్లర్ లోని ఇనుప కడ్డీలు ఆమె కడుపులో చొచ్చుకొని పోగా బయటకు తీసేసరికి ఆమె ప్రాణాలు గాలిలో కలిశాయి. దీంతో భర్త బోరున విలపించాడు కూలీలు ఉదయాన్నే ఇలా జరిగిందని కన్నీరుమున్నీరు అయ్యారు. మృతురాలికి భర్త ఇద్దరు కుమారులు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు కలిగిరి సిఐ శ్రీనివాస రావు ఎస్సై బాజిరెడ్డి తో కలిసి సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు ఈ సందర్భంగా సిఐ శ్రీనివాసరావు మాట్లాడుతూ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడతామని వాస్తవాలను తెలుసుకొని మిల్లర్లు నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు అయితే వారి పైన కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామన్నారు ఈ కార్యక్రమంలో కనక దుర్గ భవాని ఈవో శ్రీనివాసరెడ్డి వైసిపి నాయకులు జూపల్లి రాజారావు పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.