కార్పోరేట్ కళాశాలలు ఫీజుల దోపిడీ
✍️బెంబేలెత్తుతున్న విద్యార్థుల తల్లిదండ్రులు
✍️తల్లిదండ్రుల సమస్యలను ఆర్ ఐ ఓ దృష్టికి తీసుకెళ్లిన ఏ పి పేరెంట్స్ అసోసియేషన్
✍️వెంటనే స్పందించిన ఆర్.ఐ.ఓ మాల్యాద్రి చౌదరి
✍️నెల్లూరు నగరంలో పలు కళాశాలల్లో ఆర్.ఐ.ఓ ఆకస్మిక తనిఖీ
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా నెల్లూరు నగరంలో పలు కార్పొరేట్ కళాశాలల యాజమాన్యాలు ఫీజుల దోపిడీలో విద్యార్థుల తల్లిదండ్రులను పెడుతున్న ఇబ్బందులుపై ఏ పి పేరెంట్స్ అసోసియేషన్ ఆర్ ఐ ఓ గారికి ఫిర్యాదు ఇవ్వడంతో నెల్లూరు పట్టణంలోని కార్పొరేట్ కళాశాలలపై ఆర్ఐఓ మరియు వారి బృందం ఈరోజు నెల్లూరు నగరంలో పలు కళాశాలలపై ఆకస్మిక దాడులు జరుపడం జరిగింది.
ఈ దాడులలో భాగంగా నెల్లూరు నగరంలో అన్నమయ్య సర్కిల్ దగ్గర ఉన్న శ్రీ చైతన్య ఇంటర్మీడియట్ కాలేజీని ఆర్ఐఓ మాల్యాద్రి చౌదరి అకస్మాత్తు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆర్ ఐ ఓ గారు మాట్లాడుతూ ప్రైవేట్ కార్పొరేట్ కాలేజీలు విద్యార్థుల విషయంలో ఇబ్బందులకు గురి చేసినా, అదేవిధంగా ఫీజులు చెల్లించలేదని సర్టిఫికెట్లు ఆపినా ఆ కళాశాలపై కఠిన చర్యలు తీసుకుంటామని, విద్యార్థులకు ఏమైనా సమస్యలు ఉంటే వాళ్ల తల్లిదండ్రులు తమ దృష్టికి తీసుకువస్తే వెంటనే చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ప్రభుత్వం చెప్పిన నిబంధనలు ఖచ్చితంగా అమలు పరచాలని, నిబంధనలకు విరుద్ధంగా ఏ కళాశాల నిర్వహించినా ఆ కళాశాల యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆర్ ఐ ఓ గారు తెలిపారు.
సమస్యపై వెంటనే స్పందించినందుకు ఏ పి పేరెంట్స్ అసోసియేషన్ ఆర్ ఐ ఓ గారికి ధన్యవాదాలు తెలియచేసింది