నిమ్మగడ్డ కు ఎన్నికలు నిర్వహించే హక్కు లేదు – మంత్రి కొడాలి నాని

కృష్ణాజిల్లా గుడివాడ

గవర్నర్ కు ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ రాసిన లేఖపై గుడివాడలో స్పందించిన పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని.

మంత్రి కొడాలి నాని కామెంట్స్.

స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని గవర్నర్ కు లేఖ రాయడానికి నిమ్మగడ్డ రమేష్ ఎవరని ప్రశ్నించినా – మంత్రి కొడాలి నాని.

చంద్రబాబు బూట్లు నాకే నిమ్మగడ్డ కు ఎన్నికలు నిర్వహించే హక్కు లేదు – మంత్రి కొడాలి నాని.

గవర్నర్ కు సలహాలిచ్చే స్థాయి నిమ్మగడ్డ రమేష్ కు లేదు – మంత్రి కొడాలి నాని.

ప్రభుత్వాన్ని, ప్రజలను, గవర్నర్ ను లెక్కచేయని నిమ్మగడ్డ రమేష్ ను ఎన్నికల కమిషనర్ గా తాము గుర్తించం – కొడాలి నాని.

2018 జూన్ నెల లో ఎన్నికలు నిర్వహించాల్సిన నిమ్మగడ్డ, ఇప్పుడు శ్రీరంగ నీతులు చెబుతున్నాడు – మంత్రి కొడాలి నాని.

గత ప్రభుత్వాల హయాంలో నాలుగు సంవత్సరాల పాటు ఎన్నికల నిర్వహించనప్పుడు నిమ్మగడ్డ రమేష్ గుడ్డి గుర్రానికి పళ్ళు తోముతున్నాడ అని ప్రశ్నించిన – మంత్రి కొడాలి నాని.

చంద్రబాబు నాయుడు తానా అంటే తందానా,అనే నిమ్మగడ్డ రమేష్ చెప్తే, తాము ఎన్నికలు నిర్వహించాలా – మంత్రి కొడాలి నాని.

చంద్రబాబు బినామీ నిమ్మగడ్డ రమేష్ ఎన్నికలు నిర్వహిస్తామంటే తాము ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోం – మంత్రి కొడాలి నాని