ద్వారకా తిరుమలను దర్శించిన హైకోర్టు న్యాయమూర్తి

పశ్చిమగోదావరి జిల్లా.
ప్రసిద్ధ క్షేత్రమైన ద్వారకా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయాన్ని శుక్రవారం ఉదయం రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తులు కుటుంబ సమేతంగా సందర్శించారు. ఈ సందర్భంగా హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ శేషసాయి, జస్టిస్ మానవేంద్ర నాథ్ రాయ్, జస్టిస్ శ్యామ్ ప్రసాద్ లకు ఆలయ అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. ముందుగా వారు ఆలయంలో వేద మంత్రోచ్ఛారణల నడుమ ప్రదక్షిణలు నిర్వహించి ,అనంతరం స్వామి అమ్మవార్లను దర్శించుకుని పూజించారు. ఆ తర్వాత ఆలయ ముఖ మండపంలో అర్చకులు వారికి స్వామి వారి శేష వస్త్రాలను కప్పి, వేద ఆశీర్వచనాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ ఏఈవో పి నటరాజా రావు వారికి స్వామివారి జ్ఞాపికలను, ప్రసాదాలను అందజేశారు.