దేశ చరిత్రలో నిలిచిపోయే ఉద్యమం ఇది: మాజీ మంత్రి సోమిరెడ్డి

నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమం చేపట్టిన రైతులకు యావత్ భారతదేశం మద్దతు పలుకుతోంది..

రైతులకు మద్దతుగా చేపట్టిన భారత్ బంద్ కి దేశమంతా స్తంభించింది..

వరుసగా రెండు సార్లు అధికారం ఇచ్చి మోదీని ప్రధాన మంత్రిని చేసిన రైతులే రోడ్డెక్కినప్పుడు కేంద్ర ప్రభుత్వం భేషజాలకు పోకూడదు..

రైతులకు ప్రయోజనాలు కలిగించే కొత్త చట్టాలు తేవాలి.

ఎంఎస్పీని చట్టబద్ధం చేయాలి..మార్కెటింగ్ వ్యవస్థను మరింత పటిష్టం చేయాలి..

ప్రైవేటు కంపెనీలు రైతులతో చేసుకునే ఒప్పందాలు ఎంఎస్పీకి పైబడే జరిగేలా చూడాలి..

వ్యవసాయ ఉత్పత్తులను కంపెనీలు ఇష్టారాజ్యాంగా నిల్వ చేస్తే వినియోగదారులపై భారం పడకుండా చూడటం కూడా అవసరం..

నరేంద్ర మోదీ ప్రభుత్వం ఓ మెట్టు దిగి దేశమంతా వ్యతిరేకిస్తున్న చట్టాలను రద్దు చేస్తే రైతుల్లో మీ విలువే పెరుగుతుంది..

రాజకీయాలకు సంబంధం లేని రైతు ఉద్యమం విషయంలో కేంద్రం ఇన్ని రోజులుగా స్పందించకపోవడం దురదృష్టకరం..

దేశ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ప్రధాని మోదీ వెంటనే ఒక ప్రకటన చేయడంతో పాటు రైతు సంఘాలతో చర్చించి కొత్త చట్టాలను తేవాలి