తిరుపతి పార్లమెంట్ లో బిజెపి,జనసేన విజయకేతనం ఎగురవేస్తాం-బిజెవైయం

తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికల్లో బిజెపి జనసేన ఉమ్మడి గా పోటీ చేసి విజయ కేతనం ఎగుర వేస్తాము అని భారతీయ జనతా పార్టీ యువ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కేతినేని సురేంద్రమోహన్ పేర్కొన్నారు.వైసిపి ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకు వెళ్తామన్నారు. వ్యవసాయ బిల్లుపై పార్లమెంట్లో ఆమోదం తెలిపి జగన్ రాష్ట్రంలో ప్రత్యేకంగా ధర్నాలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. పేరు మార్చి ప్రచారం చేస్తున్న పథకాలు రాష్ట్ర ప్రభుత్వాన్ని చెప్పే దమ్ము మంత్రి అనిల్ కు ఉందా అని ఆయన సవాల్ విసిరారు రాష్ట్ర రాజకీయాల్లో బిజెపి సరికొత్త మార్పు తీసుకు రానుందని ఆయన హామీ ఇచ్చారు.