నెల్లూరు జిల్లా ఉదయగిరి మండలం గండిపాలెం జలాశయంలో పూర్తి నీటి సామర్థ్యం తో ఉండడంతో ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి గేట్లు ఎత్తి బయటకు నీరు విడుదల చేశారు. గండిపాలెం జలాశయం 1.88 టీఎంసీల సామర్థ్యం కాగా 1.75 టీఎంసీలు నీరు జలాశయంలోకి చేరడంతో 1200 క్యూసెక్కుల నీటిని బయటకు విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ 11 సంవత్సరాల తర్వాత గండిపాలెం జలాశయంలోకి నీరు రావడం చాలా సంతోషకరం అన్నారు మెట్ట ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురవడం వల్ల వాగులు వంకలు చెరువులు నిండి జలాశయంలోకి నీరు రావడం ఈ ప్రాంత వాసులకు ఎంతో సంతోషంగా ఉందన్నారు. జలాశయం నీరు విడుదల చేసే క్రమంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా ముంపు ప్రాంతాల వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి అధికారులను ఆదేశించారు