అంబెడ్కర్ కొందరివాడు కాదు,అందరి వాడు–చేజర్ల

డాక్టర్ బి ఆర్ అంబెడ్కర్ గారి 64 వ వర్ధంతి సందర్భంగా కోవూరు తెలుగుదేశం పార్టీ కార్యలయములోజిల్లా తెలుగుదేశం పార్టీ ప్రధానకార్యదర్శి శ్రీ చేజర్ల వెంకటేశ్వర రెడ్డి మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు డాక్టర్ బి ఆర్ అంబెడ్కర్ గారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా శ్రీ వెంకటేశ్వర రెడ్డి మాట్లాడుతూ

👉డాక్టర్ బి ఆర్ అంబెడ్కర్ గారు భారతదేశం లోనే కాకుండా ప్రపంచంలోనే గొప్ప మేధావి అని,ఆయన మన దేశానికి గొప్ప రాజ్యాంగాన్ని రూపొందించారు

👉విభిన్న మతాలు, కులాలు,విభిన్న సంస్కృతులు ఉన్న భారతదేశం లో అన్ని వర్గాలు హక్కులు కాపాడే విధంగా అంబెడ్కర్ గారు రాజ్యాంగాన్ని రూపొందించారు

👉ప్రపంచ దేశాల్లో ఎక్కడా లేనటువంటి రాజ్యాంగాన్ని రూపొందించి అందరకీ అన్ని విధాల స్వేచ్ఛ కల్పించిన అంబెడ్కర్ గారు కొందరి వాడు కాదు,అందరివాడు

👉డాక్టర్ బి ఆర్ అంబెడ్కర్ గారి ఆశయాలను తెలుగుదేశం ప్రభుత్వాలలో మరియు నందమూరి తారక రామారావు,శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అమలు చేసి చూపించారు

👉దేశమంతా అంబెడ్కర్ గారి రాజ్యాంగం అమలు అవుతున్న మన రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అంబెడ్కర్ గారి రాజ్యాంగాన్ని ప్రక్కన పెట్టి తన సొంత రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారు

👉రాష్ట్రంలో వైసీపీ పాలనలో SC,ST,మైనార్టీల పై దాడులు ఎక్కువ అయ్యాయి.ఇప్పటికయినా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు డాక్టర్ అంబెడ్కర్ గారి వర్థంతి సందర్భంగా అయినా స్ఫూర్తి పొంది రాజ్యాంగ బద్దంగా వ్యవహరించాలని కొరికుంటున్నాం

👉డాక్టర్ అంబెడ్కర్ గారి వర్ధంతి సందర్భంగా ఆయన దేశానికి చేసిన సేవలను గుర్తు చేసుకొంటూ వారికి ఘనంగా నివాళులర్పిస్తున్నాం

ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు శ్రీ దారా విజయబాబు, గొర్రిపాటి నరసింహ,ఇంటూరు విజయ్,పెనుమల్లి శ్రీహరి రెడ్డి,ఉయ్యురు వేణు,SK నాసీర్, మహ్మద్, నజీర్,SK మాసూద్, గుంజి పద్మనాభం,గోపాల్,చిన్నా, రవి,గరికిపాటి అనిల్,ప్రదీప్ తదితరులు పాల్గొన్నారు