సోమ,మంగళవారాల్లో విధులకు హాజరుకావాలి

అమరావతి: రాష్ట్రంలో ప్రభుత్వ ఉపాధ్యాయులు మళ్లీ బడి బాట పట్టనున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులు హాజరుకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. యూపీ, హైస్కూల్‌ ఉపాధ్యాయులు ప్రతి సోమ, మంగళవారాల్లో విధులకు హాజరు కావాలని ప్రభుత్వం ఆదేశించింది. ప్రతి ప్రాథమిక పాఠశాల టీచర్లు వారంలో ఒక రోజు ప్రతి మంగళవారం హాజరు కావాలని పేర్కొంది. బ్రిడ్జి కోర్సులను రూపొందించేందుకు హాజరుకావాలని ప్రభుత్వం వెల్లడించింది. నాడు-నేడు పనులు అన్ని స్కూళ్లల్లో ఈ నెలాఖరుకు పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.